24 గంటల్లో 2273 కరోనా కేసులు..

99
coronavirus

తెలంగాణలో 24గంటల్లో 2273 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,844కు చేరగా 1,31,447 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 996 మంది మృతిచెందగా 30,401 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో 0.61శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 80.71శాతంగా ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 325, రంగారెడ్డి 185, నల్గొండ 175, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 164, కరీంనగర్‌ 122, వరంగల్‌ 114, సిద్దిపేట 91, నిజామాబాద్‌లో 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ 22,76,222 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.