అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సమావేశం..

48
pocharam

హైదరాబాద్ శాసనసభ, శాసనమండలి నిర్వాహణపై ఈరోజు ఉదయం శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో సమావేశాలలో పాల్గొంటున్న సభ్యులు, విధుల్లో ఉన్న సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని సమావేశాల నిర్వహణపై సమీక్షించారు.

అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించి పరిస్థితులను తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో లెజిస్లేటివ్ సెక్రటరీ వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.