శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద..

158
srsp

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన మహారాష్ట్రలో, నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నీటితో నిండుకుండలా మారింది.

ప్రాజెక్ట్ కు 1,70,989 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ కు మొత్తం 42 గేట్లు ఉండగా…. 40 గేట్లు ఎత్తారు అధికారులు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిoది.వరద గేట్ల ద్వారా లక్ష 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువల ద్వారా కూడా ఔట్ ఫ్లో కొనసాగుతొంది.