కేసీఆర్ సీఎంగా ఉండటం మన అదృష్టం: మంత్రి తలసాని

48
talasani srinivasyadav

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామం లో ఐదవ విడత చేపల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గతంలో ఇక్కడ పనిచేసిన ఉత్తమ్ హుజూర్ నగర్ కు చుట్టపు చూపుగా రావడం తప్పా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆలీబాబా 40 దొంగల ఒక ముఠాల తయారైంది…పసలేని రాజకీయాలతో ప్రజలను ఇబ్బందులకు గందరగోళానికి గురి చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.

ప్రజలు ఛీ కొడితే ప్రతిపక్షాలు అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్నారు…అనుక్షణం హుజూర్నగర్ అభివృద్ధికి కృషి చేసే డైనమిక్ లీడర్ సైదిరెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవడం హుజూర్ నగర్ ప్రజల అదృష్టం అన్నారు.