జాతీయ చేనేత దినోత్సవం..నేతన్నలకు అవార్డులు

64
ktr handloom

గత 3 సంవత్సరములుగా ఆగస్టు 7 వ తేదిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జాతీయ చేనేత దినోత్సవమును గొప్పగా జరుపుతోంది. అందులో భాగంగా చేనేత వాక్, చేనేత కళాకారులు, చేనేత అభిమానుల బహిరంగ సభ, చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర పురస్కారాలు, జాతీయ స్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన, మరియు స్థానిక, జాతీయ అంతర్జాతీయ డిజైనర్లచే ప్రముఖ మోడళ్ళతో చేనేత ఫ్యాషన్ షో జరిగేవి.
అయితే కరోనా కారణంగా వర్చువల్ గా, ఆన్ లైన్ లో మాన్య మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమములో వర్చువల్ గా, అందరు జిల్లా కలెక్టర్లు, అవార్డు విజేతలు, చేనేత అధికారులు, చేనేత కళాకారులు చేనేత అభిమానులు, ఆయా జిల్లాల కార్యాలయాల నుండి పాల్గొన్నారు.

ఈ సంవత్సరము కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత పురస్కారములకు రాష్ట్ర వ్యాప్తంగా (18) మంది కళాకారులను ఎంపిక చేయడము జరిగినది. వీరిలో ఇద్దరికి (2) మంత్రివర్యులు మాన్య శ్రీ కె.టి. రామారావుగారి చేతుల మీదుగా అవార్డులు అందజేయడం జరిగినది. మిగిలిన (16) మంది అవార్డు గ్రహీతలకు ఆయా జిల్లా కలెక్టర్ల చేత అవార్డుల ప్రదానము జరిగినది. ఈ కార్యక్రమమును మాన్య మంత్రివర్యులు వర్చువల్ గా, ఆన్ లైన్ లో వీక్షించి ప్రతి అవార్డు గ్రహేతలతో చర్చించి, ప్రభుత్వము అమలు చేయుచున్న చేనేత పధకములపై వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగినది.
తదుపరి ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రభుత్వము / చేనేత జౌళి శాఖ మూడు సంస్థలతో రాష్టంలో చేనేత రంగము అభివృద్ధికై ఒప్పందమును చేసుకోవడం జరిగినది.

IICT సంస్థతో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్ రకంలో టై & డై చేయుటలో సులభ మార్గములను, రంగుల రసాయనాలచే చేనేత కార్మికులకు జరుగుచున్న హానిని నివారించుటకు, టై & డై టెక్నిక్ లో క్రొత్త మార్గముల అధ్యయనములకై ఒప్పందం జరిగినది.ISB సంస్థతో చేనేత కళాకారులకు, రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయుచున్న ప్రభుత్వ పధకాల అమలు పై అధ్యయనము మరియు చేనేత వస్త్రాల మార్కెటింగ్ కొరకు నూతన సలహాల కొరకై ఒప్పందం చేసుకోవడం జరిగినది.UNDP సంస్థతో చేనేత కార్మికుల జీవనోపాది పెంపుదల మరియు మార్కెటింగ్ సేవల గురించి ఒప్పందం చేసుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమములో “ఆలంబన యాప్ “ ను కూడా మంత్రివర్యులు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నదియ రషీద్, డిప్యూటీ రెసిడెంట్ UNDP గారు, శ్రీమతి శైలజా రామయ్యర్, ఐ.ఎ.ఎస్, సంచాలకులు (చే:జౌ) శాఖ వారు మరియు శ్రీ జయేష్ రంజన్, ఐ.ఎ.ఎస్ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖవారు చేనేత కళాకారులను ఉద్దేశించి తమ సందేశాలను అందజేశారు.

ఈ కార్యక్రమములో ప్రభుత్వ పధకాల అమలుపై చేనేత కళాకారుల అభిప్రాయములను తీసుకొనడం జరిగింది. తదనంతరము మంత్రి వర్యులు మాన్య శ్రీ కె.టి. రామారావు గారు తమ సందేశములో చేనేత దినోత్సవము ప్రాధాన్యత గురించి వివరించుచూ, ప్రభుత్వము చేనేత రంగ అభివృద్ధికై తీసుకోనుచున్న చర్యలు మరియు పధకాలను వివరించడం జరిగింది.

మరియు
(1) చేనేత కార్మికుల కోరిక మేరకు నేతన్నకు చేయూత పదకమును కొనసాగించుటకు ప్రతిపాదనలు పంపవలసినదిగా అధికారులను ఆదేశించారు.
(2) కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారమును ఈ సంవత్సరము నుండే రూ.10,000/- నుండి రూ.25,000/- పెంచి వారి ఖాతాలో జమచేయుటకు అధికారులను ఆదేశించారు.
(3) నారాయణ పేట జిల్లా కలెక్టర్ గారు, నారాయణ పేటలో చేనేత కళాకారులకై కామన్ ఫెసిలిటీ సెంటర్ ను నిర్మించుటకు ప్రభుత్వ స్థలము కేటాయించారు. మరియు ఈ జిల్లా నుండి అవార్డు గ్రహీతలు మరియు కార్మికుల కోరిక మేరకు ఆ స్థలములో, CFC నిర్మాణమునకు, మరియు సర్వీస్ సెంటర్ నిర్మాణములకై ప్రతిపాదనలు పంపవలసినదిగా మంత్రివర్యులు అధికారులను ఆదేశించారు.
తమ సందేశానంతరము మాన్య మంత్రివర్యులు వర్చువల్ సమావేశములో పాల్గొన్న అందరు అధికారులతో, జిల్లా కలెక్టర్లతో, చేనేత కళాకారులతో, చేనేత అభిమానులతో చేనేత ప్రతిజ్ఞ చేయించారు.