ఏపీ.. సంక్రాంతి సంబరాల్లో తలసాని..

336
Talasani Srinivas Yadav

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రపదేశ్‌లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఇక గోదావరి జిల్లాల్లో కోడిపందేల హడావుడి భారీగా ఉంది. మరోవైపు, టీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు.

Talasani Srinivas Yadav

తమ నియోజకవర్గంలో స్థిరపడ్డ ఏపీ మిత్రులతో కలసి సందడి చేయనున్నారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న తలసాని తొలుత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి భీమవరం చేసుకుని మావూళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి భీమవరంలోనే బస చేసి, రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా తలసానికి స్వాగతం పలుకుతూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి.