ఆకట్టుకునే సాంగ్స్‌తో ‘దేవ్‌’ ఆడియో..

704
Dev Movie
- Advertisement -

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’ .. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ ,రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు. పిబ్రవరి 14 రోజున విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ఆల్బమ్‌ను తాజాగా విడుదల చేశారు.

Dev Movie

ఈ ఆల్బమ్‌ను షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నాడు. ‘రేయ్ బావా దేవ్’ .. ‘షీ ఈజ్ మై గర్ల్’ .. ‘ఒక వందసార్లు’ .. ‘చెలియా’ .. ‘ఎటో వెళ్లినావే’ .. పాటలు ఈ ఆల్బమ్‌లో చోటు చేసుకున్నాయి. అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం. ‘ఒక వంద సార్లు’ .. ‘చెలియా’ .. ‘ఎటో వెళ్లినావే’ పాటలు మరింత బాగున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోంది.

- Advertisement -