వైసీపీపై పవన్ దండయాత్ర..!

44
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం యమ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల పవన్ చేపట్టిన వారాహి విజయయాత్రలో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతున్నాయి. వైసీపీ టార్గెట్ గా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. నర్సాపురంలోని జనసేన కార్యకర్తలతో భేటీ అయిన పవన్.. ” ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూస్తానని, ఏ పని మొదలు పెట్టిన మధ్యలో వదిలిపెట్టకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

గత ఎన్నికల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లకు గాను 14 సీట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లకు గాను 13 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈసారి గోదావరి జిల్లాలో అదే సీన్ రిపీట్ అవుతుందా అనే కష్టమే అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

Also Read: రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను బద్నాం చేస్తున్నారు

ఎందుకంటే జగన్ పాలనపై ఈ జిల్లాలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే ఉభయగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. దాంతో ఈసారి ఆ జిల్లాలో జనసేన సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే పవన్ కూడా వైసీపీకి ఒక్కసీటు కూడా దక్కనివ్వనని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీని పడగొట్టేందుకు పవన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేయనున్నాడు ? ఈ సారి ఆ జిల్లాల్లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది ? అనేది చూడాలి.

Also Read: ఆలయాల్లో డ్రెస్‌కోడ్‌..ఎక్కడంటే..?

- Advertisement -