మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

315
Petrol prices

గత కొద్ది రోజుల నుండి తగ్గుముఖం పట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర మళ్లీ రూ. 70 మార్క్‌ను దాటింది. కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు ఇంధన ధరలు పెరిగాయి.

Petrol prices

సోమవారం పెట్రోల్‌పై 37-40 పైసలు, డీజిల్‌పై 49-53పైసలు పెంచాయి. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70.13కు చేరింది. కోల్‌కతాలో రూ. 72.24, ముంబయిలో రూ. 75.77, చెన్నైలో రూ. 72.79గా ఉంది. ఇక డీజిల్‌ ధర దిల్లీలో రూ. 64.18, కోల్‌కతాలో రూ. 65.95, ముంబయిలో రూ. 67.18, చెన్నైలో రూ. 67.78గా ఉంది.