టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

103
IPL 2020

ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో తేలిపోయిన బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లను గెలిచి సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు ఒక్కటి మాత్రమే గెలిచి 8వ స్థానంలో ఉంది.

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్ ‌(C), జానీ బెయిర్‌స్టో(WC), మనీశ్‌ పాండే, కేన్ విలియమ్సన్‌, ప్రియం గార్గ్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, రశీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌, ఖలీల్ అహ్మాద్.

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్ ‌(C,WC), క్రిస్ గేల్, మయాంక్‌ అగర్వాల్‌, మన్‌దీప్ ‌సింగ్‌, నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మురుగన్‌ అశ్విన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌, రవి బిష్ణోయ్, మహమ్మద్‌ షమీ, షెల్డన్ కాట్రెల్‌/విల్జోయిన్.