కాంగ్రెస్, బిజెపి కుట్రలను తిప్పికొట్టాలి- హరీష్

232
minister harish
- Advertisement -

గురువారం దుబ్బాక నియోజకవర్గం,దౌల్తాబాద్‌లో జరిగిన యువ, విద్యార్థి సన్నాహాక సమావేశంలో మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలు అయ్యేదాకా దుబ్బాకలోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు.. కానీ ఎన్నికల తర్వాత కూడా దుబ్బాకలో ఉంటాడా? ప్రశ్నించారు మంత్రి.. కానీ దుబ్బాకలో ప్రజలకు అందుబాటులో ఉండేది ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, హరీష్ రావు ఉంటారు.. తరువాత సోలిపేట సుజాత అక్క ఎమ్మెల్యే గా అందరికి అందుబాటులో ఉంటారు. కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్ళు ఉంటారా? ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంత్రిగా పని చేసినప్పుడు ఏరోజైనా దుబ్బాకకి వచ్చావా.. ఏమైనా చూసావా?.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి దౌల్తాబాద్ చౌరస్తాలో నిలబడి రాయపోల్ పోదామంటే డ్రైవర్ లేకుండా నీకు తెలుస్తదా.. ఎవరూ లేకుండా పోగలవా..? అని మంత్రి ఎద్దేవ చేశారు.

పరాయి లీడర్లు, కిరాయి మనుషులను తీసుకువచ్చి చప్పట్లు కొట్టించుకుంటే సరిపోతుందా? అని విమర్శించారు. దుబ్బాక ఉద్యమాల గడ్డ.. పోరాటాల గడ్డ దుబ్బాక. స్వరాష్ట్రం కోసం ఎక్కువ పోరాటం చేసింది దుబ్బాక ప్రజలు. ఈ రోజు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రామలింగారెడ్డి దుబ్బాక ప్రజలకు ఇంటింటికీ త్రాగునీరు అందించారు. ప్రతి ఇంటి నీటి బిందెలో రామలింగన్న మొహం.. సీఎం కేసీఆర్ మొహం కనిపిస్తుంది. ఏ అక్కని అడిగిన.. ఏ చెల్లిని అడిగిన రామలింగన్న చేసిన అభివృద్ధి గురించి చెబుతారని అన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో లింగన్న 21 కొత్త సబ్ స్టేషన్లు నిర్మించారు. రైతుల కోసం కొత్త 1000 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు లింగన్న. ఇప్పుడు బాయిల కాడ మోటర్లు కాలిపోతలేవు.. బోర్ల మోటార్లు పాడు అయిత లేవు. కాంగ్రెస్ హయాంలో బీడీలు చేసే చెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?.. అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుబ్బాకలో బీడీలు చేసే చెల్లెమ్మలకు 20 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నాము. ఇన్ని అభివృద్ధి పనులు మీకు కనపడటం లేదా ? అని కాంగ్రెస్‌ మండ్డిపడ్డారు మంత్రి హరీష్‌. రామలింగన్న నాయకత్వంలో రాయపోలు కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీలుగా చేశారు. మీరు ఒక్కటైన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారా? కాంగ్రెస్, బిజెపి కుట్రలను యువకులు, విద్యార్థులు గట్టిగా తిప్పికొట్టాలి. సోలిపేట సుజాత అక్కను మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -