దేశ రాజ‌ధానిలో కొన్నసాగుతున్న కరోనా వ్యాప్తి..

280
corona

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తునే ఉంది. గురువారం కూడా కొత్త‌గా 2,726 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల మార్కును దాటి 3,00,833కు చేరింది. ఇక గ‌త 24 గంట‌ల్లో మ‌రో 37 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 5,616కు చేరింది. మరోవైపు గురువారం రిక‌వ‌రీ అయిన‌ 2,643 మందితో క‌లిపి మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 2,72,948కి పెరిగింది. ప్ర‌స్తుతం మ‌రో 22,232 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.