అంతిమ పోరులో తలపడుతున్న ఢిల్లీ- ముంబై

105
ipl

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐపీఎల్-13 సీజన్‌ అంతిమ సమరం జరుగుతోంది. మంగళవారం రాత్రి జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సత్తాచాటిన జట్టునే కొనసాగిస్తున్నట్లు శ్రేయస్‌ చెప్పాడు. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌: మార్కుస్ స్టోనియిస్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మెయిర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబడ, ప్రవీణ్ దుబే, అన్రిచ్ నార్జీ.

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కల్టర్‌నైల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.