చెన్నై పై సన్ రైజర్స్ విక్టరీ

104
csk vs srh

ఐపీఎల్ 13లో భాగంగా చెన్నైపై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 157 పరుగులు చేయగా 7 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 28 పరుగులు చేయాల్సి ఉండగా గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్‌ బౌలింగ్ నుండి తప్పుకోవడంతో సమద్ బాల్ అందుకున్నాడు. తొలి బాల్ వైడ్ ప్లస్ 4 రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 6 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా 2,4,1 ,1,1,6 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై 5 వికెట్లు కొల్పోయి 157 పరుగులు చేసింది.

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వాట్సన్ 1,అంబటి రాయుడు 8,డుప్లెసిస్ 22 ,కేదార్ జావ్ 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు.దీంతో 42 పరుగులకే నాలుగు వికెట్లు కొల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది చెన్నై. ఈ దశలో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు ధోని, జడేజా. జడేజా 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సత్తాచాటాడు. ఐపీఎల్ సీజన్‌లో జడేజాకు ఇది తొలి హాఫ్ సెంచరీ. 50 పరుగులు చేసి జడేజా పెవిలియన్ బాటపట్టారు. ధోని 7,సామ్ కర్రాన్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అంతకముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బెయిర్ స్టో పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు.

వార్నర్ 28,మనీశ్ పాండే 29,కేన్ విలియమ్సన 9 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టగా యువ భారత ఆటగాళ్లు అంచనాల్ని మించి రాణించారు.ప్రియం గార్గ్‌(51 నాటౌట్: 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ ), అభిషేక్‌ శర్మ(31: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు.వీరిద్దరు చివర్లో రాణించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 164 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌(2/31) రెండు వికెట్లు తీయగా శార్దుల్‌ ఠాకూర్‌, పియూశ్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.