MS DHONI : గ్రేటెస్ట్ కెప్టెన్సీ.. శకం ముగిసింది!

54
- Advertisement -

కెప్టెన్ కూల్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న ఎం‌ఎస్ ధోని తన కెప్టెన్సీలోని వ్యూహాలను ఇకపై మైధానంలో చూడలేము. ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు సి‌ఎస్‌కే తరుపున ధోని తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులతో పాటు యావత్ క్రికెట్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ధోని ఇలా సడన్ షాక్ లు ఇవ్వడం కొత్తేమీ కాదు గతంలో టీమిండియాకు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంలోనూ, రిటైర్మెంట్ ప్రకటించడంలోనూ ఇలాగే సడన్ గా తన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచాడు, ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కూడా అదే విధంగా చేయడంతో ధోని స్టైలే వేరు అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు, కెప్టెన్ గా మైధానంలో ధోని వ్యూహాలను అంచనా వేయడం ప్రత్యర్థులకు చాలా కష్టం. .

ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోను చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటూ జట్టుకు అనితర సాధ్యమైన విజయాలను అంధిస్తుంటాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదు సార్లు విజేతగా నిలిపిన ఘనత ఎం‌ఎస్ ధోనికే దక్కుతుంది. ఇప్పటివరకు తన కెప్టెన్సీలో సి‌ఎస్‌కే కు 133 విజయాలను అందించాడు ధోని, ఆ తరువాతి స్థానాల్లో రోహిత్ (87), విరాట్ కోహ్లీ (66), గౌతమ్ గంభీర్ (71).. లిస్ట్ లో ఉన్నారు. ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో సి‌ఎస్‌కే కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమించింది యజమాన్యం. మొత్తానికి కెప్టెన్ కూల్ గా గ్రేటెస్ట్ కెప్టెన్ గా మైదానంలో తనదైన వ్యూహాలతో అందరిని అలరించే ధోని కెప్టెన్సీని చూడలేమని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ఇక 22 న సి‌ఎస్‌కే మరియు ఆర్సీబీ జట్ల మద్య మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మరి మొదటిసారిగా ధోని కెప్టెన్సీ లేకుండా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.

- Advertisement -