బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 27 హైలైట్స్

108
episode 27

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ విజయవంతంగా 27 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శుక్రవారం ఎపిసోడ్‌లో ర్యాంప్ వాక్‌లు,గంగవ్వ,అవినాష్‌ విజేతలుగా నిలవడం,మెహబూబ్ ఇంటి సభ్యులకు వారు ఇంట్లో ఏవిధంగా ఉంటున్నారో తెలిపిందే డ్యాన్స్‌ నేర్పించడం వంటి సన్నివేశాలతో ఎపిసోడ్ ముగిసింది.

ఐ డోంట్ నో అనే మార్నింగ్ వేకప్ సాంగ్‌కి స్టెప్పులు వేసి అలరించారు ఇంటి సభ్యులు. తర్వాత మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులకు డాన్స్ నేర్పారు మెహబూబ్. లాస్యతో చపాతి స్టెప్పులు, అఖిల్‌తో వర్కౌట్స్ స్టెప్‌లు, అభితో కార్ స్టెప్‌లు, సొహైల్‌తో అర్జున్ రెడ్డి ఆవేశం స్టెప్పులు, అరియానాతో రెడ్ లవ్ స్టెప్‌లు, రాజశేఖర్ మాస్టర్‌తో కాంచన స్టెప్పులు వేయించారు. తర్వాత అవినాష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ప్రకాశ్‌ రాజ్ వాయిస్‌ని మిమిక్రీ చేస్తూ నవ్వులు పూయించాడు.

తర్వాత అఖిల్‌ని కన్ఫెషన్‌ రూంకి పిలిచిన బిగ్ బాస్ …లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయాలని కోరారు. ఉన్న పాయింట్స్‌ని 16 మందికి షేర్ చేయాలని కోరగా వారికి కొంత లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ ఇస్తూ బోర్డుపై పేర్లు రాశాడు అఖిల్.తర్వాత హౌస్‌లోకి చందన బ్రదర్స్ వాళ్లు కొత్త బట్టలు పంపించడంతో అందంగా తయారై ప్యాషన్ షో చేసేశారు. ర్యాంప్ వాక్ చేసి విజేతలకు ఆడవారికి ఒక లక్ష, మగవారికి 1 లక్ష ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. అయితే పురుషుల్లో అవినాష్, మహిళల్లో గంగవ్వను ఫ్యాషన్ షో విన్నర్‌గా ప్రకటించారు.

విజేతగా నిలిచిన అవినాష్‌ని ఆడవారికి అద్దంలా మారతారని వారు రెడీ అవుతుండగా మనసులో మాటచెప్పాలన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి అవినాష్ ముందు కూర్చొని మాట్లాడుతుండగా నవ్వులు పూయించాడు అవినాష్. హారిక రాగానే ఈమె అద్దానికి అందడం లేదంటూ కింద కూర్చున్నాడు.. అయితే గంగవ్వ వెళ్లి అవినాష్‌ గాలి తీసేసింది.

అయితే అవినాష్ జోక్‌గా మాట్లాడిన మాటల్ని సీరియస్‌గా తీసుకుని తెగ బాధపడిపోయింది సుజాత. అవినాష్ ఆమెకు సారీ చెప్పగా అరియానా గ్లోరీ అవినాష్‌కి క్లాస్ పీకింది. వాళ్లకి నచ్చకపోతే వాళ్లతో ఉండకు వాళ్ల కోసం నువ్ గేమ్ ఆడటం ఎందుకు అంటూ హితభోద చేసింది. మొత్తంగా శుక్రవారం ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా ముగిసింది.