IPL 2024 :చెన్నై బోణి.. ధోని రికార్డ్!

55
- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ టోర్నీ ఆరంభం అయింది. నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. మొదటి మ్యాచ్ లో చెన్నై బోణి కొట్టింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. డూప్లెసిస్ (35), విరాట్ కోహ్లీ (21, అనుజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38) పరుగులు చేసి జట్టు కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ఐతే లక్ష్య ఛేదనలో చెన్నై మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడడంతో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శివం దుబే (34), రహనే(27), రచన్ రవీంద్ర (37) మిచెల్ (22), జడేజా (25) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎట్టకేలకు తొలి మ్యాచ్ లో బోణి కొట్టి సరికొత్త ఉత్సాహంతో సి‌ఎస్‌కే ముందుకు సాగనుంది.

ధోని రికార్డ్..
టోర్నీ ప్రారంభానికి ముందు ధోని ఓపెనర్ గా లేదా మూడో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగుతాడని భావించారంతా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎప్పటిలాకే లోయర్ ఆర్డర్ కే ధోని ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ తో ధోని సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధికంగా రనౌట్లు చేసిన వికెట్ కీపర్ గా ధోని నిలిచాడు. నిన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్ తో జరిగిన మ్యాచ్ లో అనుజ్ రావత్ ను రనౌట్ చేసి ధోని ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 42 రనౌట్లు, 138 క్యాచ్ లు, చేసి ఓవరాల్ 180 మందిని ఔట్ చేశాడు ధోని. ఆ తరువాతి స్థానాల్లో దినేష్ కార్తీక్ (169), సాహా (106), ఊతప్ప (90) ఉన్నారు.

ఇక నేడు జరిగే ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ , రాత్రి 7 గంటలకు కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

Also Read:KCR:కేజ్రీవాల్ అరెస్ట్ చీకటిరోజు

- Advertisement -