త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా: మంత్రి ఎర్రబెల్లి

257
errabelli

క‌రోనా వైర‌స్ విస్తృతి త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని, దాని తీవ్ర‌త కూడా త‌గ్గుతుంద‌ని, ప్ర‌జ‌లి మ‌రికొద్ది రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండి, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌న‌గామ జిల్లా పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని క‌రోనా బాధితులు, వారి కుటుంబ స‌భ్యుల‌తో టెలీ కాన్ఫ‌రెన్సులో మాట్లాడారు. క‌రోనా బాధితులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి ధైర్యాన్ని చెబుతూ, తానున్నాన‌నే భ‌రోసానిచ్చారు.

ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో మందులు, మంచి వైద్యం అందుబాటులో ఉంద‌న్నారు. క‌రోనా ప‌రీక్ష‌లు నిరంత‌రం జ‌రుగుతున్నాయ‌‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. నిరుపేద‌ల‌ను ఆదుకుంటామ‌ని, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను సైతం అండ‌గా ఉండాల‌ని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిరంత‌రం త‌మ సిబ్బంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌ని చెప్పారు. ఇబ్బందులుంటే ప్ర‌జ‌లు త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని మంత్రి సూచించారు.