టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక..

37
Sri Lanka

కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా ఈరోజు టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టులో ఉదన స్థానంలో కసున్ రజిత తుదిజట్టులోకి వచ్చాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొదటి వన్డేలో ఆడిన జట్టునే బరిలో దింపుతున్నారు.కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో నెగ్గింది. తద్వారా సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని ఆతిథ్య లంక కృతనిశ్చయంతో ఉంది.

తుది జట్లు ఇలా ఉన్నాయి:

ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీషా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత అసలంక, డాసన్ షనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసున్ రజిత, ధుశ్మంత చమీర, లక్షన్ సందకన్