‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్ ప్రారంభం..

133

శర్వానంద్, రష్మిక మందన్న జంట‌గా ఫస్ట్ టైం తిరుమల కిషోర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. అయితే ప్రాజెక్టును ప్రకటించి చాలా రోజులే అయింది. పలు కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది.

తాజాగా ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన ఫొటోను వదిలారు. శర్వానంద్ – రష్మికలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనునట్లు సమాచారం. ఈ చిత్రానికి సంభందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.