తొలి వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

43

కొలంబలోని ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా, శ్రీలంక జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. దసున్ షనక నాయకత్వంలోని యువ శ్రీలంక జట్టు… అనుభవజ్ఞులతో కూడిన టీమిండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డపై ఆడుతుండడం లంక జట్టుకు కలిసొచ్చే అంశమే అయినా, ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల పిచ్ లపై ఆడిన అనుభవం టీమిండియా ఆటగాళ్ల సొంతం.

తుది జట్లు..

ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీషా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత అసలంక, డాసన్ షనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, ఇసురు ఉదాన, ధుశ్మంత చమీర, లక్షన్ సందకన్