గుట్కా కేసులో సచిన్ జోషి అరెస్ట్!

235
sachin joshi

ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఉక్కిరిబిక్కిరవుతున్న సినీ ఇండస్ట్రీ తాజాగా గుట్కా వ్యవహారం కేసులో సినీ నటులకు లింక్‌ బయటపడటం అందరిని కలవరపరుస్తోంది. తాజాగా గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు సచిన్ జోషిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.

హైదరాబాద్‌లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గుట్కాను భారీ సంఖ్య‌లో ప‌ట్టుకున్నారు. నిందితులను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచిన్ జోషి పేరు బయటకు రావడంతో అప్పటినుండి సచిన్‌ను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సచిన్‌పై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద నిషేధిత మత్తు పదార్థాల కేసు పెట్టారు. లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఎట్టకేలకు ముంబైలో సచిన్‌ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. సచిన్ తండ్రి గుట్కా కింగ్‌..గుట్కా వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్న సచిన్ ఫ్యామిలీ అత్యంత సంపన్న కుటుంబం. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్‌ పండు,ఆజాన్,జాక్‌పాట్‌,వీరప్పన్`,వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్‌ చిత్రాల్లో న‌టించారు.