మొక్కలునాటిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్‌..

108
gic

రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా న పుట్టినరోజు పురస్కిరించుకొని మొక్కలు నాటిన యస్.సి యస్ టి కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్.

తన సొంత తండా అయిన పొడగుట తండాలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం జయంతి అదేవిధంగా తన పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటడం , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉంది అన్నారు.

కేసీఆర్ చేపట్టిన హరితహారం చాల మంచి కార్యక్రమం ,దీనికి మద్దతు గా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనతికాలంలో మంచి ప్రజాదరణ పొందింది , పర్యావరణ పరిరక్షణకోసం , వాతావరణ సమత్యులత కోసం మొక్కలు నాటడం మన బాధ్యత అన్నారు . ఈ ఉద్యమం ఇలానే కొనసాగాలని కోరారు.