ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు..

16
- Advertisement -

వాహనదారులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడగించింది పోలీస్ శాఖ. నిన్నటితో గడువు ముగియగా దానిని ఈ నెల 31 వరకు పొడగిస్తున్నట్లు తెలిపారు పోలీసు అధికారులు. సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని అందుకే గడువును పొడిగించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు

పెండింగ్‌ చలాన్ల ద్వారా రూ.107కోట్ల ఆదాయం సమకూరగా రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్‌ చలాన్లను వాహనదారులు చెల్లించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59కోట్ల ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లు రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80శాతం రాయితీ.. ఆర్టీసీ బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీ రాయితీని ప్రకటించారు.

Also Read:IND vs AFG : పసికూనే.. కానీ ప్రమాదమే?

- Advertisement -