ఈ-చలాన్..సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త

30
- Advertisement -

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్లు ప్రారంభమైన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్ సైట్ సర్వర్ తాత్కాలికంగా డౌన్ అయింది. దీనిని అవకాశంగా తీసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి వాహనదారుల నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఓ పోర్టల్ ను పోలీసులు (http://echallanstspolice.in/)గుర్తించారు. ఇలాంటి వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

Also Read:ముందు ఎన్టీఆర్ తోనా ?..చరణ్ తోనా ?

- Advertisement -