నాకొక గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాలి:మోనాల్‌తో అఖిల్

381
monal

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4లో హాట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు అఖిల్-మోనాల్‌. టాస్క్ ఏదైనా,వీరిద్దరిలో ఎవరు ఎవరితో గొడవ పడినా ఒకరికొకరు అండగా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా అమీతుమీ టాస్క్‌లో కూడా వీరిద్దరు వేరే టీంలో ఉన్నా ఒకరిగా ఆడేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా ఓ టాస్క్‌లో గార్డెన్‌లో కూర్చున్న అఖిల్‌ని అందులో నుండి లేచేలా అరియానా టీం సభ్యులు విశ్వప్రయత్నం చేయగా అదే టీంలో సభ్యురాలిగా ఉన్న మోనాల్‌….అఖిల్‌పై ప్రేమను చూపించింది.

టాస్క్ అయిపోయిన తర్వాత కూడా వీరి లవ్‌ స్టోరీ అలాగే కంటిన్యూ అయింది. ఇక తర్వాత మిర్రర్ ఇమేజ్ అంటూ ఎదురెదురుగా కూర్చొని ప్రేమ మత్తులో తేలారు.తను ఏం చేస్తే అఖిల్ అదే చేస్తున్నాడని.. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలే అంటూ పాట పాడింది.. అఖిల్ కూడా నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలని పాడటంతో తెగ సిగ్గుపడిపోయింది. ఆ తరువాత అఖిల్.. మొన్న కనిపించావు.. మైమరచిపోయాను.. అందాలతో నన్ను తూట్లు పొడిచేశావు అంటూ మెనాల్‌ని చూస్తూ పాట అందుకున్నాడు. దీంతో థాంక్యూ అంటూ తెగ సిగ్గుపడిపోయింది మోనాల్.