రవితేజ…న్యూ ఇయర్ గిఫ్ట్

40
krack

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా ‘క్రాక్‌’. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

నూతన సంవత్సర కానుకగా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. న్యూ ఇయర్‌కి మాస్‌ కా బాప్‌ ట్రైలర్ వస్తుందంటూ పేర్కొంది.

సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయబోతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌కటించారు.