ముంపు నిర్వాసితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలి: కేటీఆర్

173
- Advertisement -

మిడ్ మానేరు నిర్వాసితుల పట్ల ఉదార స్వభావంతో వ్యవహరించాలని, ప్రాజెక్టు నిర్మాణంలో వారి త్యాగం మరువలేనిదని, వారి సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో ఉండాలని మున్సిపల్,ఐటీ శాఖా మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలపై అధికారులతో మంత్రి శ్రీ కేటీఆర్ సోమవారం హైదరాబాదలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ముంపు బాధిత 11గ్రామాల్లో పరిహారం అందని అర్హులైన లబ్దిదారుల ఇండ్లను తక్షణమే గుర్తించి వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మాన్వాడ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి మిగిలిన 197 మంది లబ్ధిదారులకు వెంటనే పరిహారాన్ని విడుదల చేయాలని సూచించారు. అదేవిధంగా అర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి అర్హులైన వారందరికీ పరిహారం అందించాలని చెప్పారు. 18 సంవత్సరాలు పరిధిలోకి వచ్చే యువతీ యువకులకు అందించాల్సిన పరిహారం విడుదల చేయాలని ఆదేశించారు.

అలాగే ముంపు గ్రామాల పరిధిలోని యువతీ యువకులు స్వయం ఉపాధి ద్వారా లబ్ది పొందే విధంగా, వారికీ ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు. ఐఎవై పథకం కింద నిర్వాసితులందరికి గృహ నిర్మాణ పరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్అండ్ఆర్ నిధులు వెంటనే విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -