మెల్ బోర్న్ టెస్టు…భారత్ టార్గెట్ 70

49
bumra

మెల్ బోర్న్ టెస్టులో భారత బౌలర్లు అద్బుత ప్రదర్శన కనబర్చారు. తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు బరిలోకి దిగిన రహానే సేన ఆసీస్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారులను 195 పరుగులకే ఆసీస్‌ని కట్టడి చేసిన భారత్…రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగుల స్వల్ప స్కోరుకే ఆసీస్‌ని ఆలౌట్ చేసింది. దీంతో 69 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది ఆసీస్.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 133/6 ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఆస్ట్రేలియా కొద్దిసేపు బౌల‌ర్స్‌ని ప్ర‌తిఘ‌టించింది. ముఖ్యంగా గ్రీన్(45), క‌మ్మిన్స్ (22) మంచి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ జోడిని బుమ్రా విడ‌దీయ‌గా క‌మ్మిన్స్ ఏడో వికెట్ రూపంలో పెవీలియ‌న్‌కు చేరాడు. తర్వాత వెంటవెంటనే వికెట్లు కొల్పయింది ఆసీస్. దీంతో 200 పరుగులకు ఆలౌటైంది.

భార‌త్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే 70 ప‌రుగులు చేయాల్సి ఉండగా తొలి ఇన్నింగ్స్‌ 326 ప‌రుగులు చేసిన సంగతి తెలిసిందే.