ఐపీఎల్ 2020..ఢిల్లీదే: రబాడ

228
rabada
rabada

ఇప్పటివరకు ఐపీఎల్ గెలవని జట్లలో ఒకటి ఢిల్లీ. గతేడాది ఐపీఎల్‌కి చేరువగా వెళ్లింది కానీ క్వాలిఫైయర్ 2లో ఓటమిపాలై నిరాశతో వెనుదిరిగింది. అయితే ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు దక్షిణాఫ్రికా ఆటగాడు రబాడ.

2019 సీజన్‌లో టైటిల్‌కి చాలా చేరువగా వెళ్లాం. కాబట్టి.. ఈ ఏడాది కూడా అదే జోరుని కొనసాగించగలమనే నమ్మకంతో ఉన్నాం అని చెప్పారు. ఇది కొత్త సీజన్ కావడంతో మళ్లీ ఫస్ట్ నుంచి జర్నీ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా టీమ్ మంచి సమతూకంతో ఉందని తెలిపాడు.

ఐపీఎల్ 2019 సీజన్‌ 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 9 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుని 18 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌లాడిన రబాడ 31 వికెట్లు పడగొట్టాడు.