షూటింగ్‌ షురూ చేసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌..

92
Superstar Mahesh

గత కొద్ది నెలలుగా కరోనా దెబ్బకు టాలీవుడ్‌లో షూటింగ్‌లకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. దీనితో స్టార్స్ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు.. తాజాగా కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాయి.. ఈనేపథ్యంలో లాక్ డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబు మ‌ళ్లీ తొలిసారి షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు. ఈ రోజు రేపు హైద‌రాబాద్ లో ఓ వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న షూటింగ్ లో ఆయ‌న పాల్గొన‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోకు వ‌చ్చి షూటింగ్ జ‌రిగే ప్రాంతాన్ని ప‌రిశీలించి, నిర్వాహ‌కుల‌తో మాట్లాడాడు.

ఈ షూట్ నుండి మహేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షికార్ చేస్తోంది. ఈ ఫోటోలో పసుపు చొక్కా – బ్రౌన్ ప్యాంటులో తెలుపు స్పోర్ట్స్ షూలతో కనిపిస్తున్నారు. చేతిలో ముసుగు ఉంది. కాఫీ సిప్ చేస్తూ అతను దర్శకుడితో సంభాషించడం కనిపిస్తుంది. ఇక ఆన్ లొకేషన్ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రకటన నిర్మాణ బృందం పిపిఇ కిట్లు.. ఫేస్ మాస్క్ లు.. క్రిమిసంహారక శానిటైజర్లు రెడీ చేశారట. సామాజిక దూర నిబంధనల వంటి అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.