IPL 2024:ఈ జట్ల కల నెరవేరెనా?

44
- Advertisement -

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 17 వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్ని కూడా ప్లేయర్లతో సిద్దమయ్యాయి. ఆటగాళ్లు కూడా మైదానంలో ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ కలిగిన దేశీయ లీగ్ లలో ఐపీఎల్ మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి లీగ్ లో టైటిల్ గెలిచేందుకు జట్ల యొక్క యాజమాన్యాలు గట్టి పట్టుదలతో ఉంటాయి. అయితే ఇప్పటివరకు 16 సీజన్లు గడిచినప్పటికి కొన్ని జట్లు మాత్రం ఇంతవరకు కప్పు అందుకోలేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, డిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్.. వంటి వంటి జట్లకు ప్రతి సీజన్ లో కూడా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మూడు జట్లు ఒక్కోసారి ఫైనల్ కు వెళ్ళిన.. కప్పు అందుకోలేకపోయాయి.

ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాయి ఈ మూడు జట్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉంది. ప్రతి సీజన్ లో కూడా ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ అంచనాలు పెంచుతున్న ఆర్సీబి.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టేందుకు సిద్దమైంది. కోహ్లీ, డూప్లిసిస్, మాక్స్ వెల్.. త్రయంతో 16 ఏళ్ల కలను నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఆర్సీబి తరుపున ఐపీఎల్ కప్ కోహ్లీ అందుకోవాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి ఈ సీజన్ లోనైనా అభిమానుల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

అలాగే పంజాబ్ కింగ్స్ ఈసారి కప్పు వేటలో బలంగానే కనిపిస్తోంది. శిఖర్ ధావన్ సారథ్యంలో ఉన్న పంజాబ్ బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. దాంతో ఈ సీజన్ ఎలాగైనా కప్పు ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. డిల్లీ క్యాపిటల్స్ ది కూడా ఇదే పరిస్థితి. రోడ్ యాక్సిడెంట్ కారణంగా క్రికెట్ కు దూరమైన రిషబ్ పంత్ చాలరోజుల తరువాత ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇస్తూ డిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. పంత్ సారథ్యంలో ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉంది డిల్లీ టీం. మరి ఏ జట్టు కప్పు గెలుస్తుందో చూడాలి.

Also Read:TTDP:తెలంగాణలో టీడీపీ కనుమరుగు?

- Advertisement -