డిసెంబర్ 21…కేజీఎఫ్‌ 2 సర్‌ప్రైజ్‌!

62
kgf 2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్‌. మాఫియా నేపథ్యంలో కన్నడ,హిందీ,తెలుగు,తమిళ్‌ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అన్నిభాషల్లో కలిపి ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ స్పెష‌ల్ రోల్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 2018 డిసెంబర్ 21న కేజీఎఫ్: చాప్టర్ 1 విడుదలైంది. 2019 డిసెంబర్ 21న కేజీఎఫ్: చాప్టర్ 2లో యశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 21న కూడా కేజీఎఫ్: చాప్టర్ 2 నుంచి ఓ అప్‌డేట్ బయటకు రాబోతోందట. ఈ నెల 21న ఉదయం 10.08 గంటలకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని ప్రశాంత్ నీల్ వెల్లడించాడు.