మహబూబ్‌నగర్‌లో బీజేపీకి షాక్..

48
bjp

బీజేపీకి భారీ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత ఎర్ర శేఖర్ ప్రకటించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్న ఎర్ర శేఖర్ అనంతరం మీడియా ప్రతినిధులకు స్వయంగా ఫోన్ చేసి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. శేఖర్ రాజీనామాతో బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.