Prabhas:’సలార్ 3′ నేపథ్యం ఇదేనా?

11
- Advertisement -

సలార్ కి సీక్వెల్ గా ‘సలార్ 2’ తెరకెక్కుతుండగా.. ఇప్పుడు దానికి కూడా సీక్వెల్ గా ‘సలార్ 3’ ఉంటుంది అంటూ మేకర్స్ నుంచి వస్తున్న స్పాయిలర్స్ తో ప్రభాస్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సలార్ 1 తో ప్యాన్ ఇండియా ని షేక్ చేశారు. అర్హత ఉన్నా కూడా లేని అధికారం కోసం కాకుండా స్నేహం కోసం కసితో ఎలా ఎదురు తిరిగాడు, ఆ క్రమంలో ఎంతమందిని తొక్కి.. ఎంతమందిని శత్రువులుగా మార్చుకున్నాడో అనేది సలార్ పార్ట్ 1 లో చూపించగా.. పార్ట్2 లో ప్రభాస్ రైజింగ్, అలాగే శత్రువులను ఎలా గెలిచాడో అనేది ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు.

మరి, సలార్ పార్ట్ 3 లో ఏం చూపిస్తారు ?, అసలు దీని నేపథ్యం ఎలా ఉండబోతుంది ? అనేది ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ లో నడుస్తున్న ఆసక్తికర అంశం. అయితే, ‘సలార్ 3’ కథని జర్మనీ బ్యాక్ డ్రాప్ లో ప్రశాంత్ నీల్ రెడీ చేసుకుంటున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. రీసెంట్ గా ప్రభాస్ జర్మనీలో జరుగుతున్న ఓ షెడ్యూల్ కు కూడా హాజరు అయ్యాడు. దీంతోనే సలార్ పార్ట్ 3 లో జర్మనీ నేపథ్యం ఉండబోతుంది అంటున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి మూవీలతో పాటు సలార్ కి కూడా జపాన్ మార్కెట్ లో సూపర్ క్రేజ్ లభించింది.

అందుకే, సలార్ 3ను జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరి సలార్ పార్ట్ 2 ని త్వరగా చిత్రీకరించి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని ప్రశాంత్ నీల్ – ప్రభాస్ చూస్తున్నారు వచ్చే ఏడాది ఆగస్టు 15, 2025న సలార్ 2 చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ డేట్ కి సినిమా వర్క్ మొత్తం పూర్తి కావడం కొంచెం కష్టం.

Also Read:IND vs ENG :టీమిండియా చేసిన తప్పు అదే!

- Advertisement -