కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్…

43
indrakaran

నిర్మల్ జిల్లా గండి రామన్న హరితవనంలో కోతుల పునరవాస కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. స్థానికంగా ఏర్పాటు చేసిన చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్, మూషిక జింకల పార్కును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఇది తొలి పున‌రావాస శిబిరం. రూ. 2.25 కోట్ల అట‌వీ శాఖ నిధులతో ఈ ‌ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను తొలుత సంరక్షణ, పునరావాస కేంద్రానికి తీసుకొస్తారు. గ్రామాల్లో ఉండే కోతుల‌ను బంధించి, అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించ‌డం గ్రామ‌పంచాయ‌తీల‌ బాధ్య‌‌త‌. త‌ర్వాత అట‌వీ శాఖ అధికారులు వాన‌రాల‌ను అక్క‌డి నుంచి పునరావాస, రక్షణ కేంద్రాల‌కు త‌ర‌లిస్తారు. అక్క‌డ విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడతారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. దశల వారీగా కోతులను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాకా మ‌ళ్ళీ అడ‌వుల్లో వ‌దిలేస్తారు.