పోలీసులు నాపై లాఠీచార్జ్ చేశారు- రాహుల్‌ గాంధీ

151
rahul

గురువారం హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తన కాన్వాయ్ తో యూపీ బయల్దేరిన రాహుల్ గాంధీని పోలీసులు గ్రేటర్ నోయిడా వద్ద నిలిపివేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన ముందుకు వెళ్లేందుకు యత్నించారు. దాంతో హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయినా వినకుండా రాహుల్ ముందు సాగారు. ఈ సమయంలో యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ దశలో పోలీసులతో తోపులాటలో రాహుల్ కిందపడిపోయారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఆయన పైకి లేచేందుకు సాయపడ్డారు. కిందపడిన అన్నను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు.

ఈ ఘనట అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు త‌న‌ను నెట్టివేసిన‌ట్లు… త‌న‌పై లాఠీచార్జ్ కూడా చేసిన‌ట్లు రాహుల్‌ ఆరోపించారు. త‌న‌ను నేల‌పై ప‌డేసిన‌ట్లు ఆయన తెలిపారు.ప్ర‌ధాని మోదీని ఈ ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నాన‌ని, కేవ‌లం మోదీజీ మాత్ర‌మే ఈ దేశంలో న‌డుస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓ సాధార‌ణ వ్య‌క్తి క‌నీసం న‌డ‌వ‌లేరా అని ఆయ‌న నిల‌దీశారు. మా వాహ‌నాల‌ను అడ్డుకోవ‌డం వ‌ల్ల న‌డ‌క ప్రారంభించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. హ‌త్రాస్‌కు 140 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గ్రేట‌ర్ నోయిడా వ‌ద్ద రాహుల్ వాహ‌నాన్ని నిలిపేశారు. అయితే వాహ‌నాలు దిగిన రాహుల్, ప్రియాంకాలు.. వంద‌కుపైగా కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హ‌త్రాస్‌కు కాలిన‌డ‌క‌న వెళ్తున్నారు. సెక్ష‌న్ 188 కింద రాహుల్‌, ప్రియాంకాల‌ను అరెస్టు చేశారు.