ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా చాటేనా?

15
- Advertisement -

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటలపై కాంగ్రెస్ బలంగా దృష్టి సారిస్తోంది. బీజేపీకి చెక్ పెట్టాలంటే ఆ పార్టీ బలం ఉన్న రాష్ట్రాలలో పట్టు సాధిస్తే ఎన్నికల్లో బీజేపీని ఈజీగా ఎదుర్కోవచ్చనే ఆలోచన హస్తం అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బీజేపీ ఆధిపత్యం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. మరి ముఖ్యంగా గుజరాత్ లో కాంగ్రెస్ సత్తా చాటి దాదాపుగా ముప్పై ఏళ్ళు దాటిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా గుజరాత్ లో సత్తా చాటెందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 26 ఎంపీ స్థానాలు ఉన్న గుజరాత్ లో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా క్లీన్ స్వీప్ పైనే కన్నెసింది కాషాయ పార్టీ.

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ బీజేపీ ఆధిపత్యం కొనసాగడం మామూలే. అయితే ఇక్కడ 26 స్థానాలలో కనీసం పది స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పుడే బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఈసారి ఆం ఆద్మీ పార్టీతో కలిసి గుజరాత్ లో పోటీ చేయనుంది కాంగ్రెస్. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ కారణంగా ఆప్ ఏమంత యాక్టివ్ గా కనిపించడంలేదు. అయితే అక్రమంగా కేజ్రివాల్ ను అరెస్ట్ చేశాశరనే సానుభూతి కలిసొస్తుందనే భావనాతో కాంగ్రెస్ మరియు ఆప్ పార్టీలు ఉన్నాయి.

ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. 19 ఎంపీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 27 సీట్లలో బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం రెండు సీట్ల తోనే సరిపెట్టుకుంది. దాంతో ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవాలని చూస్తోంది హస్తం హైకమాండ్. ఈ రాష్ట్రాలతో పాటు బిహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది, ఇలా బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలలో ఎలాగైనా మెజారిటీ సీట్లను సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. మరి హస్తం పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.

Also Read:పవన్, చంద్రబాబు..ఉమ్మడి ప్రచారం?

- Advertisement -