ఐపీఎస్‌లపై అనుచిత వ్యాఖ్యలు..ఎంపీ అరవింద్‌పై కేసు

17
aravind

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరవింద్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులను ఉద్దేశించి ఈ నెల 3న తన నివాసం వద్ద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అరవింద్. ఐపీఎస్ అధికారులు ఏం పీకుతున్నారు… మీ పోలీసుల లాఠీలు ఏం పీకుతున్నాయి…మీ లాఠీలు పనిచేయడం లేదా..మీ లాఠీలు లంచాలు తీసుకుంటున్నాయా ktr.. kcr దగ్గర అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు మీ డిపార్ట్మెంట్ చెంచా గిరి చేస్తున్నారు.


లాంటి తీవ్ర పదజాలంతో మాట్లాడిన ఎంపీ అరవింద్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఐపీసీ 294, 504, 5051(1),(b) సెక్షన్ల కింద ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.