పుష్పపై మహేష్ ప్రశసంలు..

30
mahesh

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయగా విడుదలైన ప్రతీ భాషలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. సినిమా స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్ అని ట్వీట్ చేశాడు. దర్శకుడు సుకుమార్‌,హీరో అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై ప్రశంసలు గుప్పించారు మహేశ్‌.

ఇక ప్రస్తుతం మహేశ్ నటించిన సర్కార్ వారి పాట విడుదలకు సిద్ధంగా ఉండగా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడు మహేశ్‌.