బాండు పేపర్ ఫ్లెక్సీతో అర్వింద్ పరువు పోయే..!

88
aravind
- Advertisement -

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇందూరు రైతన్నలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే…5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని, లేకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు బోర్డు సాధన ఉద్యమంలో పాల్గొంటా అంటూ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ను ఎంపీ ఎన్నికల సమయంలో పసుపు రైతులకు బాండు పేపరు రాసిచ్చాడు. అర్వింద్ బూటకపు బాండు పేపరును నమ్మిన పసుపు రైతులు టీఆర్ఎస్ అభ్యర్థి కవితమ్మను ఓడించి మరీ అర్వింద్‌ను గెలిపించారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అర్వింద్ పసుపు రైతులకు గుండు కొట్టాడు. అసలు 5 రోజుల్లో బోర్డు తెస్తానని బాండు పేపర్‌లో రాయలేదని బుకాయించాడు. దీంతో పసుపు బోర్డు కోసం రైతన్నలు మళ్లీ రోడ్డున పడ్డారు. అయితే తాజాగా అర్వింద్ పసుపు బోర్డుపై బాండు పేపర్ రాసిచ్చి వేయి రోజులైంది.

ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గం తల్వేద గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యాలయం వద్ద..పలువురు పసుపు రైతన్నలు టెంట్ వేసి నిరసన దీక్షకు దిగారు. టెంట్ పక్కనే అర్వింద్ రాసిచ్చిన బాంబ్‌పేపర్‌‌ను భారీ ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించారు. బీజేపీ ఎంపీ అర్వింద్ రాసిచ్చిన బాండు పేపర్‌కు ఇప్పటికే 1000 రోజులు గడిచాయని, వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించాలని రైతన్నలు కోరారు. ఈ సందర్భంగా దీక్షా స్థలం వద్ద రైతులు ఏర్పాటు చేసిన అర్వింద్ బాండ్ పేపర్‌‌ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. రైతన్నలకు దీక్షకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది..బాండ్ పేపర్ రాసిచ్చి రైతన్నలకు బ్యాండేసిన అర్వింద్ వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి పసుపు బోర్డు పోరాటంలో కలిసిరావాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

మొత్తంగా అర్వింద్ బాండ్ పేపర్‌కు వేయి రోజులైంది అంటూ పసుపు రైతులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాండ్ పేపర్ రాసిచ్చి వేయి రోజులాయే..బోర్డు ఏడబోయే గుండన్న అంటూ నెట్‌జన్లు అర్వింద్‌ను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. మరి ఆర్మూర్ రైతన్నల నిరసన దీక్షలపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -