ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోవాలి: మాలమహానాడు

70
malamahanadu
- Advertisement -

నిజామాబాద్ సీపీ నాగరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు మాలమహానాడు కార్యకర్తలు. రోడ్డుపై బైఠాయించి ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన మాలమహానాడు కార్యకర్తలను అరెస్టు చేసి నాంపల్లి పిఎస్ కు తరలించారు పోలీసులు.

అరవింద్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాల మహానాడు కార్యకర్తలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.ఒక దళిత పోలీసు అధికారిని అవమానపరుస్తూ తన చదువు పైన వ్యక్తిత్వం పై వ్యాఖ్యలు చేసిన  అరవింద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు.

ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి  తన మనువాద భావజాలంతో దళితులపై ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. సి పి నాగరాజు కు క్షమాపణలు చెప్పాలని లేదంటే ఎంపీ అరవింద్ ను దళితులు. దళిత సంఘాలు గా అడ్డుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -