పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ..రెమ్యూరేషన్ ఎంతో తెలుసా?

303
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అజ్నాతవాసి మూవీ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించనున్నాడని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ వర్గాలు ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికి టాలీవుడ్ వర్గాలు మాత్రం అవుననే సమాధానం వినిపిస్తుంది. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రిమేక్ చేయనున్నారు.

ఈమూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్నారు. ఈసినిమాను బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు ఎంసీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. వేణు శ్రీరామ్ ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఇందుకు సంబంధించిన సెట్ ను కూడా హైదరాబాద్ లో వేస్తున్నారట.

త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గోననున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పవన్ అందుకోనున్న పారితోషికం గురించిన చర్చలు ఫిల్మ్ నగర్లో జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమాకి పారితోషికంగా ఆయన 40 కోట్లను అందుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈసినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్.