ప్రతిపక్షంలోనే ఉంటాం…శివసేనతో శరద్ పవార్

441
Sharad Pawar
- Advertisement -

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. బీజేపీ, శివసేన పార్టీలు రెండు పట్టు మీద ఉండటంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. 50-50 ఫార్ములాలో భాగంగా తొలుత సీఎం ఛాన్స్‌ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న శివసేన వెనక్కితగ్గడం లేదు. ఫలితం వచ్చి 10 రోజులు గడుస్తున్న సీఎం పదవి ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. శివసేన 50-50 ఫార్ములాకు ఎట్టి పరిస్ధితుల్లో ఒప్పుకునేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని భావించిన శివసేన ఆశలపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నీళ్లు చల్లారు. తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దీర్ఘకాల పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేయలేమని సోనియా అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది.ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.

కాగా తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో శివసేన సీనియర్ నేత సంజర్ రౌత్ ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో పాటు మా పార్టీ కూడా విపక్షంలోనే కూర్చుటాం అని స్పష్టం చేశారు. శివసేన, బీజేపీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయాలని వారికి సూచించినట్లు తెలిపారు. ప్రజలు తమకు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంలోనే కూర్చుండనున్నట్లు తెలిపారు. ఎట్టిపరిస్ధితులతో శివసేనతో కలవబోమని తేల్చి చెప్పారు.

- Advertisement -