పవన్ పేరులోనే ఉంది పవర్

29
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలు ఈ పేరు వింటేనే చాలు, జనాల్లో ఓ అలజడి. ముఖ్యంగా కుర్రాళ్ళో అంతులేని ఉత్సాహం. అసలు పవన్ పేరులోనే ఉంది అసలైన పవర్. ఆయన తెర మీద కనిపిస్తే అభిమానులకు పూనకాలే. పవర్ స్టార్ అంటే చాలు సినీ ఇండస్ట్రీనే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులకు అదో కిక్కు. సినిమా హీరోగానే కాదు, జనసేనానిగా కూడా జనం కోసం రాజకీయ కండువా కప్పుకున్నారు పవన్. ఇదే హవా, ఇదే జోష్ చిరకాలం నిలవాలని కోరుకుంటూ మా గ్రేట్ తెలంగాణ.కామ్ పవన్ కి హ్యాపీ బర్త్ డే తెలియజేస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలానే పవన్ తన లుక్స్, డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:నిమ్మరసంతో ఆరోగ్యం..

అలాగే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఇక‌ పవన్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై AM రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి పవన్ సినిమాల నుంచి ఇలా క్రేజీ అప్ డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Also Read:విజయ్ దేవరకొండపై చైతు రివేంజ్

- Advertisement -