దేశ పేరుపై కూడా రాజకీయమా.. ?

36
- Advertisement -

ప్రజెంట్ దేశ రాజకీయాల్లో మన దేశ పేరు మార్పుకు సంబంధించిన చర్చ హాట్ టాపిక్ అయింది. ఆ మద్య విపక్ష కూటమికి ఇండియా పేరు నిర్ణయించిన తరువాత ఈ వాదన ఆద్యం పోసుకుంది. మన దేశం హిందూ దేశం అని కాబట్టి హిందూస్తాన్ గా పిలవాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. భారతీయులను బానిసలుగా చేసి దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఇచ్చిన ఇండియా పేరు దేశానికి వద్దని, హిందూస్తాన్ గా పేరు మార్చాలని డిమాండ్ ను బీజేపీ నేతలు తరచూ వినిపిస్తున్నారు.

అయితే ఈ తరహా వాదన గతంలో ఎందుకు లేదు ఎప్పుడేందుకు మొదలైందనే ప్రశ్నకు మాత్రం మోడి సర్కార్ వద్ద ఎలాంటి సమాధానం దొరకని పరిస్థితి. కేవలం ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అనే అర్థం వచ్చేలా నామకరణం చేయడం వల్లనే దీనిపై రాజకీయం చేసేందుకు మోడి సర్కార్ ఈ ఆలోచన చేస్తోందనేది బహిరంగ రహస్యం. ఇక బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ కూడా తాజాగా ఇదే మాటను ప్రస్తావించింది.

మన దేశం హిందూ దేశం అని దీనిని ఇండియా అని కాకుండా ” భారత్ అని పిలవాలని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రాచీనకాలం నుంచి మన దేశం పేరు భారత్ అని.. అందువల్ల అన్నీ రంగాల్లోనూ ఇండియా పదానికి బదులు భారత్ పదాన్ని ఉపయోగించాలని ఆయన చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఎన్నికల వేల దీనిపై రాజకీయం చేసేందుకు బీజేపీ ఆర్ ఎస్ ఎస్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇండియా, భారతదేశం, హిందూస్తాన్.. ఇలా ప్రతిపదం కూడా మన దేశన్నే సూచిస్తుందని, అలాంటప్పుడు పద మార్పు వల్ల దేశ భక్తిలో ఎలాంటి మార్పు ఉండదనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

Also Read:విజయ్ దేవరకొండపై చైతు రివేంజ్

- Advertisement -