పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా..

147
- Advertisement -

నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..

వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య నవంబర్ 29వ తేదీ నుంచిపార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతుల మృతికి కారకులని ఆరోపిస్తూ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టగా వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీల ఆందోళన మధ్య సభ ఇవాళ నిరవధికంగా వాయిదా పడనుంది.

- Advertisement -