దేశంలో 24 గంటల్లో 6317 కరోనా కేసులు..

75
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,317 కొవిడ్‌ కేసులు నమోదుకాగా 318 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,58,481కు చేరగా 3,42,01,966 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్ కేసులుండగా 4,78,325 మంది ప్రాణాలు కొల్పోయారు.

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరగా ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఏపీ, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.