శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు…

26
nirmal police

ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ లు నిర్వహించడం జరుగుతుందని డి.ఎస్.పి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా అందులో అనుమతి పత్రాలు లేని 140 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారు, 7 వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం డి.ఎస్.పి మాట్లాడుతూ ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు పోకుండా, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. కాలనీలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతూ కనిపించినట్లయితే వెంటనే మాకు సమాచారం అందించాలని.. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.