మహిళా బిల్లు..ఎందుకీ పెండింగూ?

43
- Advertisement -

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా బిల్లు కేంద్ర కేబినెట్ ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును నిన్న లోక్ సభలో ప్రవేశ పెట్టగా ఆమోదం పొందింది. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా మహిళా బిల్లుకు సానుకూలత చూపడంతో బిల్లు లోక్ సభలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందింది. ఇక నేడు రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే రాజ్య సభలో కూడా బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అయితే బిల్లు అమలులోకి వచ్చేది ఎప్పుడు అన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం బిల్లు ఆమోదం పొందినప్పటికి దాని అమలును హోల్డ్ లో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది..

నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఈ బిల్లు వర్తించదని స్పష్టం చేశారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ పూర్తయిన తరువాతనే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రదాన్యత లభిస్తుందని ఆశించినప్పటికి భంగపాటు తప్పలేదు. ఇక వచ్చే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారితే మహిళా బిల్లు మళ్ళీ మరుగున పడే అవకాశం ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

Also Read:వామ్మో..రక్తపోటుతో కిడ్నీ సమస్యలు!

ఎందుకంటే లోక్ సభ, రాజ్యసభ లో ఆమోదం పొందినప్పటికి చట్టం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ బిల్లు అలాగే మరుగున పడే అవకాశం ఉందనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట. ఇక తాజా పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేక పవనాలు విస్తున్నాయి. దాంతో ఒకవేళ అధికారం మారితే.. కొత్త ప్రభుత్వం మహిళ రిజర్వేషన్స్ పై ఏమైనా ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి మహిళా బిల్లు విషయంలో ఆశ చూపి ఇప్పుడు కాదు అన్నట్లు ఆమోదమైతే లభించినప్పటికి చట్టంగా రూపొందడంలో మాత్రం పెండింగ్ లోకి వెళ్లింది.

Also Read:బాలయ్య షో నుంచి బిగ్ అప్‌డేట్

- Advertisement -